వెబ్‌సైట్‌ పై కేసు పెట్టనున్న పూనమ్

Poonam Pandey want to put case on website

11:31 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Poonam Pandey want to put case on website

పూనమ్ పాండే ఒక వెబ్‌సైట్‌ పై దావా వేయనుంది. ఒక బాలీవుడ్‌ హీరో కొడుకుతో డేటింగ్‌ చేసిన తరువాత పూనమ్ కు గర్బం వచ్చిందనీ, ఆమె అబార్షన్‌ చేయించుకుందనీ ఒక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా జనవరి 18న అబార్షన్‌ చేయించుకోవడానికి ముంబైలో ఉన్న హిందుజ హాస్పటల్‌ కు వెళ్ళిందని ఆ వెబ్‌సైట్‌లో రాసారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పై ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని మండి పడుతుంది పూనమ్. ఇలాంటి చెత్త వార్తలు రాసేముందు ఒకసారి చెక్‌ చేసుకోవాలి కదా. ఇలా ఒకరి గౌరవ మర్యాదలను దెబ్బ తీసే విధంగా వార్తలు రాయడం సరైనది కాదు అని పూనమ్ అంది.

అంతేకాకుండా ఇదంతా అబద్దం అనీ, ఈ వెబ్‌సైట్‌ పై దావా వేయనున్నట్లు పూనమ్ ట్వీట్‌ చేసింది. ఈ సంఘటన ద్వారా చాలా మంది అభిమానుల్లో సానుభూతి సంపాదించింది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తుందని కొంతమంది విమర్శిస్తున్నారు.

English summary

Poonam Pandey want to put case on website. One website wrote wrong information about Poonam Pandey.