చిన్నారిని మెర్సీ కిల్లింగా ...

Poor Parents Seeks Mercy Killing of their baby

12:05 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Poor Parents Seeks Mercy Killing of their baby

లోకంలో అనేక సమస్యలు .. ఎలాగోలా బతకాలని , ఎందుకు ఈ బతుకు అని .. ఇలా రకరకాల జనాలు. కుటుంబ సమస్యలు , ఆర్ధిక బాధలు ఇలా ఎన్నో ఇందుకు కారణం అవుతున్నాయి. ఇక ఆర్హ్దిక స్థోమత లేక వైద్యం అందించేయలేని తమ చిన్నారిని మెర్సీ కిల్లింగ్ కి అనుమతివ్వాలని ఓ కుటుంబం కోర్టుని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే, లివర్ మార్పిడి చికిత్సకు తగినంత స్థోమత లేకపోవడంతో ఓ చిన్నారి మెర్సీకిల్లింగ్ కు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. నూతలచెరువు మండలం బత్తలాపురం రైల్వేగేటు వద్ద నివాసం ఉంటున్న రమణప్ప, సరస్వతి దంపతులకు జ్ఞానసాయి అనే 8నెలల చిన్నారి ఉంది. ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచి లివర్ జబ్బుతో బాధపడుతోంది. ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి సర్జెరీ చేయించారు. ఇందుకు రూ.4నుంచి 5 లక్షల వరకు ఖర్చు అయ్యింది. కాగా ఆపరేషన్ విఫలమవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

చిన్నారికి పరీక్షించిన అక్కడి వైద్యులు లివర్ మార్పిడికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులకు తేల్చిచెప్పారు. అంతేకాదు, ఆపరేషన్ అనంతరం ఐదారు సంవత్సరాల పాటు నెలకు దాదాపు రూ.60 వేలు మందులకు ఖర్చు అవుతుందని తెలిపారు. అంతస్తోమత లేకపోవడంతో మెర్సీ కిల్లింగ్ కు అనుమతివ్వాలంటూ తల్లిదండ్రులు తంబళ్లపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తారని వినిపిస్తోంది.

ఇది కూడా చూడండి: తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

ఇది కూడా చూడండి: రేప్ చేస్తే ఆ దేశాల్లో వేసే శిక్షలకు భయపడాల్సిందే

ఇది కూడా చూడండి: అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

English summary

Poor Parents Seeks Mercy Killing of their baby.