చిల్లిగవ్వ లేకున్నా...బరిలో  అభ్యర్ధులు

Poor People Participating In West Bengal Elections

10:42 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Poor People Participating In West Bengal Elections

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెనక ఆస్తులు బానే ఉండి ఉంటాయన్న ఉద్దేశం అందరిలో వుంది. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి మరి. అయితే ఇందుకు భిన్నంగా పశ్చిమ్‌ బంగా మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురికి అసలు ఆస్తులే లేవట. ఏప్రిల్‌ 17న జరగబోయే మూడో దశ ఎన్నికల్లో వీరు పోటీలో ఉన్నారు. అలాగే మరో ఏడుగురి ఆస్తులు వెయ్యి రూపాయలకంటే తక్కువే ఉన్నాయి. బినోయ్‌ కుమార్‌ దాస్‌, సందీప్‌ రాయ్‌ అనే ఇద్దరు స్వతంత్రులూ పశ్చిమ్‌బంగాలోని రాయ్‌గంజ్‌, మయూరేశ్వర్‌ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బహుజన్‌ ముక్తి పార్టీ తరఫున దుబ్రాజ్‌ పూర్‌(ఎస్‌సీ) నియోజకవర్గం నుంచి ఖాగన్‌ దాస్‌ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. వీరు ముగ్గురూ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల వివరాల్లో.. ప్రస్తుతం తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేదని అలాగే తమకు ఎలాంటి స్థిర చరాస్తులూ లేవని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: అదో వింత షాపు, ఓనరు ఉండడు, కావాల్సింది తీసుకుని డబ్బులు వేయడమే

ఖాగన్‌ దాస్‌(28) అయితే తాను తన కుటుంబం పొదుపు చేసిన ధనంతోనే బతుకుతున్నానని అంటున్నారు. రోజు కూలీగా పనిచేస్తూ కొంత ధనం సంపాదిస్తాడు. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటుండటంతో తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందట. కాగా ఇప్పుడు పశ్చిమ్‌ బంగాలో మూడో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో భారత ఫుట్‌బాల్‌ ఆటగాడు బాయ్‌చుంగ్‌ భుటియానే సంపన్నుడు. ఆయనకు రూ.17కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున సిలిగురి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు సరాసరిన రూ.54.2లక్షలుగా ఉన్నాయి. మొత్తం 56 మంది కోటీశ్వరులు. వారిలో ఒక్క తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులే 23 మంది ఉన్నారు. మూడో దశ ఎన్నికలు మొత్తం 56 స్థానాలకు జరుగుతుండగా 383 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

సర్దార్ పై పూరి సెట్టైర్లు

భార్య అక్రమ సంబంధాన్ని వీడియో తీసిన భర్త

సిటీ బస్సుల్లో ఉచిత వైఫై

English summary

West Bengal Elections were going in the state and few of the independent members were also to participating in this elections some of them were poor people who has less than 1000 rupees of Assets.