బిస్లరీ నుంచి 'పాప్'

Pop Soft Drink From Bisleri

04:28 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Pop Soft Drink From Bisleri

ప్రముఖ మినరల్ వాటర్, క్లబ్ సోడా తయారీదారు బిస్లరీ తన రూట్ మార్చింది. 'పాప్‌' పేరుతో సాఫ్ట్ డ్రింక్ ల రంగంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని బిస్లరీ ఇంటర్నేషనల్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్బన పదార్థాలు కలిసిన శీతల పానీయాలకు ప్రజలు దూరమవుతున్న తరుణంలో బిస్టరీ సాఫ్ట్ డ్రింక్ ల బాట పట్టడం గమనార్హం. బిస్లరీ లిమోనాట, బిస్లరీ ఫొంజో, బిస్లరీ పిన కొలడ, బిస్లరీ స్పైసీ అనే నాలుగు కొత్త ఫిజ్జీ పానీయాలను మార్కెట్ లోకి ప్రవేశపెడుతోంది. బిస్లరీకి ఉన్న భారీ మార్కెట్‌.. పాప్ విస్తరణకు తోడ్పడుతుందని బిస్లరీ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ లో ఆదరణ పెంచేందుకు గానూ.. ప్రజలకు చేరువ చేసేందుకు డిజిటల్‌, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు.

English summary

Bisleri Company re enters into soft drink segment.Bisleri was going to release Bisleri Pop soft Drink.Bisleri Company announced this today.Bisleri has launched a range of four new fizzy drinks called Bisleri Limonata, Bisleri Fonzo, Bisleri Pina Colada and Bisleri Spyci.