పోర్ట్రోనిక్స్ నుంచి సౌండ్ వాలెట్ స్పీకర్లు

Portronics launches Sound Wallet Speakers

10:53 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Portronics launches Sound Wallet Speakers

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ పోర్ట్రోనిక్స్ సరికొత్త బ్లూటూత్ స్పీకర్లను రిలీజ్ చేసింది. సౌండ్ వాలెట్ పేరిట ఈ స్పీకర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్పీకర్ల ధర రూ.1500. ఆన్ లైన్.. ఆఫ్ లైన్ లో ఈ స్పీకర్లు వినియోగదారులకు లభిస్తున్నాయి. పేరుకు తగినట్టుగానే సౌండ్ వాలెట్ స్పీకర్లు అరచేతిలో ఇమిడిపోతాయి. 10 మీటర్ల దూరం వరకు బ్లూటూత్ పనిచేస్తుంది. ఈ స్పీకర్లపై మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు సంబంధించిన కంట్రోల్ బటన్స్‌ను ఇచ్చారు. దీంతోపాటు వాటిపై 4 చిన్నపాటి ఎల్‌ఈడీలను అమర్చారు. ఇవి స్పీకర్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ పవర్‌ను సూచిస్తాయి. బ్లూటూత్ 2.1 టెక్నాలజీ ఆధారంగా ఈ స్పీకర్లు పనిచేస్తాయి. బ్లూటూత్ లేని డివైస్‌లకు కూడా కనెక్ట్ చేసుకునే విధంగా దీంట్లో ఒక ఆక్స్-ఇన్ పోర్ట్‌ను అందిస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో డివైస్‌లు, ఎంపీ3 ప్లేయర్లు, ల్యాప్‌టాప్‌లకు ఈ స్పీకర్‌లు కనెక్ట్ అవుతాయి. దీని ద్వారా దాదాపు 6 గంటల వరకు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్‌ను ప్లే చేసుకోవచ్చు.

English summary