కబాలి పోస్టల్ కవర్లు

Postal department releasing Kabali special covers

12:00 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Postal department releasing Kabali special covers

గతంలో ఏదైనా సినిమా రిలీజయ్యాక అందులో హీరో హీరోయిన్లు వాడిన చీరలు, పంచెలు వంటివి నచ్చేస్తే, ఆ పేరుతోనే పంచెలు, చీరలు అమ్మేవారు. పెదరాయుడు పంచెలు వంటివి ఆకోవలేకే వస్తాయి. పాపులారిటీ ఇప్పడు కొత్తపుంతలు తొక్కుతోంది. అసలే సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా మామూలుగా లేదు. ఎక్కడ చూసినా కబాలినే కనిపిస్తున్నాడు. ఫ్లైట్లు.. సిల్వర్ కాయిన్లు.. ఇలా రకరకాల ఫీట్లు చేసేసిన కబాలి.. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్ మెంట్ ని కూడా కవర్ చేసేస్తున్నాడు. రజనీకాంత్ మూవీ కబాలికి రిలీజ్ కి గుర్తుగా ప్రత్యేకంగా కబాలి పోస్టర్లను ముద్రించిన కవర్లను భారతీయ పోస్టల్ శాఖ విక్రయించనుంది.

కర్నాటక పోస్టల్ సర్కిల్.. చెన్నై సిటీ సర్కిల్ లు ఎయిర్ ఏషియాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రత్యేకమైన కవర్లు.. ఎయిరేషియా కబాలి ఫ్లైట్ లో జర్నీ చేయనున్నాయి. రజినీకాంత్ ఫోటోతో పాటు బ్రాండ్ కబాలిని ప్రింట్ చేసిన పోస్టర్లను.. లిమిటెడ్ ఎడిషన్ గా ప్రింట్ చేసి విక్రయించనున్నారు. చెన్నై - బెంగళూరుల్లో మాత్రమే ఈ కవర్ల విక్రయం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు కబాలి సెన్సేషన్స్ ఇక్కడితో ఆగేట్లుగా కనిపించడం లేదు. రిలీజ్ కి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో.. ఇప్పటికే హైప్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. అన్ని చోట్లా వీకెండ్స్ వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్మోస్ట్ ఫుల్స్ అయిపోయాయి.

నో టికెట్ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. విడుదలకు ముందే ఇంతలా హిస్టరీ క్రియేట్ చేస్తున్న కబాలి రిలీజయ్యాక ఎలాంటి సంచలనం సృష్టించనుందో.

English summary

Postal department releasing Kabali special covers