చెన్నైలో.. శశికళ పేరుతో పోస్టర్లు

Posters Of Sasikala Near Jayalalitha House In Tamilnadu

11:42 AM ON 10th December, 2016 By Mirchi Vilas

Posters Of Sasikala Near Jayalalitha House In Tamilnadu

అమ్మ మరణంతో తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయోనని అంతటా చర్చ సాగుతుంటే, ఇంకోపక్క తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేరుతో చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. జయలలిత సొంత నివాసమైన పోయెస్ గార్డెన్స్ బయట ఇవి కనిపించాయి. మీ నేతృత్వంలో అమ్మ బంగారు పాలన కొనసాగాలంటూ కొందరు పార్టీ నేతలు ఆకాక్షించారు. జయ మరణాంతరం అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరుకు ఇది అద్దం పడుతోంది.

ఇక పార్టీలోని కొందరు కీలక వ్యక్తులు పగ్గాల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. పోయెస్ గార్డెన్ లో జయతో కలసి చాలా కాలంగా ఉంటున్న శశికళ, ఆమె బంధువులు ఒక వర్గం కాగా, తమిళనాడు తాజా సీఎం పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులు మరో వర్గంగా కనిపిస్తోంది. పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రధాన కార్యదర్శి పదవి కోసం శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు అనుకూలంగా మద్దతుదారులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఎం.జి.ఆర్ తర్వాత పార్టీని విజయాలవైపు మళ్లించిన జయలలిత లాంటి చరిష్మా శశికళకు వుంటుందా లేక అమ్మ జపంతో నెట్టుకొస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:అమ్మ మరణంపై అనుమానాలు - సంధించిన 8 ప్రశ్నలు

ఇవి కూడా చదవండి:నోట్ల రద్దుపై సుప్రీం ప్రశ్నల వర్షం ... కేంద్రం ఉక్కిరిబిక్కిరి

English summary

Recently Tamilnadu's Chief Minister Jayalalitha was died and Panneer Selvam has taken the oath as the New Chief Minister Of Tamilnadu. Now Jayalalitha's Friend Sasikala's posters have been sticked near to the jayalalitha's residency in Tamilnadu.