అభిమానులకే అంకితం : పవన్‌

Power Star Pawan kalyan dedicates his movie for fans

11:33 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Power Star Pawan kalyan dedicates his movie for fans

పవన్‌ అంటే ఫేన్స్‌ కి పిచ్చి. ఆయన కోసం అభిమానులు ప్రాణం ఇస్తారు. అంతేకాదు పవన్‌ సైతం తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నట్లు ఉంటారు. ఎల్లవేళలా పవన్‌ తన అభిమానులను తలచు కుంటూనే ఉంటారు. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ రీసెంట్‌ గా నటిస్తున్న చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, దీనిని సైతం అభిమానులకే అంకితం అంటున్నారు పవన్‌. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శరద్‌ మరార్‌ ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు.

అభిమానుల అంచనాలకు ఏ మాత్రం వెనుకాడకుండా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అంటున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా ఏఫ్రిల్‌ 8న ఈ సినిమాను రిలీజ్‌ అయ్యేవిధంగా ప్లాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా ఘాటింగ్‌ జరుగుతుందని తెలిసిన విషయమే.

హైదరాబాద్‌ లోని ఒక పురాతన భవంతిలో క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్‌ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్లు అంచనా. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ఘాటింగ్‌ పూర్తి చేసుకుంది, ప్రస్తుతం చివరి ఫైట్‌ సన్నివేశం ఘాటింగ్‌ జరుపుకుంటుంది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ రాం లక్ష్మణ్‌ వీరిరువురు ఈ క్లైమాక్స్‌ ఫైట్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఫైట్‌ని కంపోజ్‌ చేసారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ తరువాత పవన్‌ ఇంకా కాజల్‌ ఇద్దరూ స్విట్జర్లాండ్‌ వెళ్ళబోతున్నారు. ఇక కధ స్విట్జర్లాండ్‌ లో పూర్తవుతుంది.

సర్దార్ మూవీ హైలైట్స్ ఇవే

మెగా పాటకి పవర్‌ స్టార్ స్టెప్పులు

English summary

Pawan Kalyan was presently acting in Sardar Gabbarsingh movie under the direction of Babi and this movie producer Sharrath Marar. Power Star pawan kalyan have huge fan following. Pawan dedicates sardaar film his fans