పవన్ కి సంపూ ఫుల్ సపోర్ట్ ..

Power Star Pawan Kalyan Got Full Support From Sampoornesh Babu

10:36 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Power Star Pawan Kalyan Got Full Support From Sampoornesh Babu

పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి సంపూ సపోర్ట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా? ఇంతకీ విషయం ఏమంటే, తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాడతానన్నారు. తిరుపతి సభలో పవన్ వ్యాఖ్యలను సమర్థించేవారు కొందరైతే, వ్యతిరేకించేవారు మరికొందరు. అయితే సినీ పరిశ్రమ నుంచి మాత్రం ఎవరూ పవన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈ సమయంలో పవన్ కు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించాడు సంపూర్ణేష్ బాబు. ఈ నేపథ్యంలో ఓ లేఖ రాసి దానిని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు.

‘నేను పుట్టింది తెలంగాణ అయినా.. నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత బాధలో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కల్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసింది. రాష్ట్రాలు వేరైనా కష్టం వచ్చినపుడు తెలుగు వారంతా ఒక్కటే. సీమాంధ్ర బాధని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ తెలుగు వాడికీ ఉంది. పవన్ కల్యాణ్ గారి ఉద్యమంలో నేనూ ఓ గొంతు అవుతున్నా. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ, నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చేమో’ అంటూ ఆ లేఖలో సంపూ రాశాడు. దీంతో పలువురు నెటిజన్లు సంపూకి జేజేలు పలుకుతున్నారు.

ఇది కూడా చూడండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చూడండి: ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు!

ఇది కూడా చూడండి: వినాయక చవితి ఉత్సవాల్లో మీరు చేస్తున్న క్షమించరాని తప్పులు

English summary

Power Star Pawan Kalyan Got Full Support From Sampoornesh Babu. Sampoornesh Babu writes a letter on twitter for pawan kalyan.