పవన్ లెటర్ తో కలకలం

Power star Pawan Kalyan letter in Social Media

10:42 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Power star Pawan Kalyan letter in Social Media

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూటే వేరు. పుస్తకాలు , సాహిత్యం విపరీతంగా చదివే అలవాటున్న పవన్ లోతైన భావాలు కలిగి వున్నాడని అంటారు. అయితే ఈమధ్య మౌనంగా వున్న పవన్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. పవన్ పేరిట ఓ లెటర్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ లెటర్ పవన్ రాశాడా? లేక ఆయన పేరు మీదుగా ఎవరైనా రాశారా? అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

రీల్ లైఫ్ లోనేకాదు రియల్ గా ఎంతోమంది మనసులను దోచుకున్న హీరో పవన్ కల్యాణ్ . మంచి మనసున్న వ్యక్తిగా చాలామంది భావిస్తారు. నచ్చిన వాళ్లకు గిఫ్ట్ లు పంపడం, హెల్ఫ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలపడం ఆయన స్టైల్ గా చెబుతారు. అలా తన క్లోజ్ ఫ్రెండ్ తివిక్రమ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ రాసిన ఓ లేఖ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంటే, అందరూ తమదైన శైలిలో కామెంట్స్ పెట్టిస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో పవన్ మళ్లీ అచ్చు చేయిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని తనకు పరిచయం చేసిన త్రివిక్రమ్ కు, రీ ప్రింట్ కు అంగీకరించిన శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకికి పవన్ ఆ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ లెటర్ లో పవన్ సంతకంతోపాటు డేట్ కూడా ఉంది. అదండీ అసలు కధ. మొత్తానికి పవన్ తీరుకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చూడండి : నీతా అంబానీ కాస్ట్లీ లైఫ్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

ఇది కూడా చూడండి : అందమైన అమ్మాయిలను అంగట్లో అమ్మేస్తున్నారు!

ఇది కూడా చూడండి : ట్రూ లవ్ అంటే ఇలా ఉండాలట.. చదివితే షాకౌతారు!

English summary

Power star Pawan Kalyan letter Halchal in Social Media.