మరోసారి గొంతు విప్పనున్న పవర్‌స్టార్‌!

Power Star Pawan Kalyan singing a song in Sardar

11:55 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Power Star Pawan Kalyan singing a song in Sardar

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ దాదాపు రెండు సంవత్సరాల తరువాత నటిస్తున్న కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా రాయ్లక్ష్మీ, సంజన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'పవర్‌' ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే గుజరాత్‌లో పూర్తిచేసుకుని పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌ తిరిగి వచ్చాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌కళ్యాణ్‌ సర్దార్ లో ఒక పాట పాడబోతున్నారని వినిపిిస్తుంది.

స్వతహాగా దేవిశ్రీప్రసాద్‌ తన ప్రతీ ఆల్బమ్‌లో సినిమాకి సంబంధించిన హీరోతో కానీ, హీరోయిన్‌తో కానీ పాట పాడిస్తూ ఉంటాడు. ఇంతకముందు కూడా పవన్‌కళ్యాణ్‌తో 'అత్తారింటికి దారేది'లో కాటమ రాయుడా పాట పాడించాడు దేవిశ్రీ. ఇప్పడు ఇందులో కూడా పాడించాలని పవన్‌ని కలిసాడట దేవిశ్రీ. పవన్ కూడా పాడటానికి ఇష్టంగానే ఉన్నారట. అయితే పవన్‌కళ్యాణ్‌ గొంతు పాట రూపంలో మరోసారి వినబోతున్నాం మాట. ఇది పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి నిజంగా పండగే.

English summary

Power Star Pawan Kalyan singing a song in Sardar Gabbar Singh. Devisri Prasad is composing this song.