'సర్దార్' కిరాయిల కోసం పవన్ కారు అమ్మేశాడు?

Power Star Pawan kalyan Sold Benz Car

10:45 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Power Star Pawan kalyan Sold Benz Car

ఈ మద్య విడుదలైన సర్ధార్ చిత్రం ఘోరంగా దెబ్బతినడంతో, ఎలాగైనా మాంచి మూవీ తీయాలని ఉవ్విళూరుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఫిల్మ్ సర్కిల్ లో ఓ న్యూస్ హల్ చల్ చేసేస్తోంది. ఇంతకీ అదేమిటంటే, పవన్ కి ఎంతో ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ కారుని అమ్ముకున్నాడట. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా? ఐనా ఇష్టమొచ్చిన వాహనాన్ని ఎందుకు అమ్మాడు? ఇలా రకరకాల ప్రశ్నలు ఆయన అభిమానుల బుర్రల్ని తొలిచేస్తున్నాయి.

పవన్ తన సొంత బ్యానర్ పై తెరకెక్కించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీసు డిజాస్టర్ అయ్యింది. పవన్ కెరీర్ లో భారీ ప్లాప్ మూవీ గా తేల్చేశారు.ఇక ఈ మూవీలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులకు పవన్ డబ్బులు ఇవ్వలేదట. బిజినెస్ అయి లాభాలు వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు అప్పట్లో గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అందుకే కొత్త ప్రాజెక్ట్ పక్కాగా చేస్తున్నాడని కూడా అనుకున్నారు. అయితే సర్దార్ సినిమాకి సంబంధించి ప్లస్.. మైనస్ వంటి లెక్కలు పక్కనబెడితే, లేటెస్ట్ గా డాలీ డైరెక్షన్ లో న్యూమూవీ చేస్తున్నాడు. ఇందులోభాగంగా కొంత మొత్తం కావాల్సివచ్చి కారుని అమ్మేసినట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా ఒట్టి రూమర్ అని, ఎవరో కావాలని ఇదంతా పవన్ పై రూమర్లు క్రియేట్ చేస్తున్నారని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటున్నారు . మరి ఇది రూమర్ అనుకుంటే, అసలు ఎవరు ఇలా క్రియేట్ చేసారు, వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి వంటివి తేలాల్సి వుంది. కానీ కారు అమ్మాడన్నది నిజమని కొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో ఎవరికెరుక?

ఇది కూడా చూడండి: అఖిల్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్

ఇది కూడా చూడండి: నాలుగు రోజుల్లో బరువు తగ్గడానికి సులభమైన మార్గం

ఇది కూడా చూడండి: కలాం హెయిర్ స్టైల్ తో పాటు మీకు తెలియని నిజాలు!

English summary

Power Star Pawan kalyan Sold Benz Car