పార్టీ కోసం టీవీ ఛానల్ పెట్టనున్న పవన్ కళ్యాణ్!

Power Star Pawan Kalyan want to float a tv channel

12:18 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Power Star Pawan Kalyan want to float a tv channel

టాలీవుడ్ స్టార్ హీరో, మరియు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఛానల్ పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ సమయంలో ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తాను ఇంక సినిమాలకు దూరం కాబోతున్నాని, రెండు, మూడు సినిమాలు తర్వాత ఇక పూర్తిగా రాజకీయాలు పై దృష్తి పెడతానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'జనసేన' పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంచితే, రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ కచ్చితంగా కావాలి. ఎటువంటి సెలబ్రిటీలుకైనా, రాజకీయ నాయకులకైనా టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ల ద్వారానే పబ్లిసిటీ వస్తుంది.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చెయ్యాలంటే లైసెన్స్ కావాలట

సెలబ్రిటీల విషయంలో ఏం జరిగినా మీడియా హైలెట్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హీరో కాబట్టి ఆయన విషయంలో మీడియా ఎప్పుడూ బాగా స్పందిస్తాదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడంవల్ల వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలుస్తారు? లేదా ఒంటరిగా పోటీ చేస్తారా? అనే విషయం మనకింకా తెలీదు. ఒంటరిగా పోటీ చేస్తే వ్యతిరేక పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియాతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతీ పార్టీకి సొంతంగా ఛానల్ ఉండటం లేదా ప్రముఖ ఛానల్ యొక్క మద్దతు ఉండటం చూస్తూనే ఉన్నాం.

ఇది కూడా చదవండి: చిరుకు షాకిచ్చిన ఉపాసన

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగితే.. వ్యతిరేక పార్టీకి చెందిన మీడియా ఆయనను టార్గెట్‌గా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పొగుడుతున్న వారే అప్పుడు తిట్టవచ్చు. ఇది జనసేనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సొంత మీడియా ఉంటే బాగుండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ కూడా కొత్త టీవీ ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ పెట్టడం లేదా ఓ న్యూస్ పేపర్ పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పార్టీ నడిపేందుకే డబ్బులు లేవని పవన్ చెప్పారు.

ఇది కూడా చదవండి: ముప్పావు గంట ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంది

దానికి 100 కోట్లు ఖర్చువుతుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత యూట్యూబ్ ఛానల్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఓ ఛానల్ కూడా కొంటారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త టీవీ ఛానల్ కొంటారనే విషయం ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇంట్లో పని వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని చెప్పిన పవన్ మరి ఛానల్ ఎలా పెడతాడని ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

English summary

Power Star Pawan Kalyan want to float a tv channel. Janasena party chairman and leader Power Star Pawan Kalyan want to float a tv channel for his party.