సూపర్ స్టార్ ఒక్కరే నాకు పోటీ: పవర్ స్టార్

Power Star Srinivasan sensational comments on Super Star

03:30 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Power Star Srinivasan sensational comments on Super Star

పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోకండి, అలా అనుకుంటే తప్పులో కాలు వేసిన వారు అవుతారు. పవర్ స్టార్ మన తెలుగు పవర్ స్టార్ కాదు, తమిళంలో కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు. మనోళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ.. తమిళనాడుకు వెళ్లి పవర్ స్టార్ ఎవరు? అంటే.. ఇంకెవరు శ్రీనివాసనే కదా అని అంటారు తమిళ తంభీలు. ఇక్కడ మనకి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎలాగో అక్కడ పవర్ స్టార్ శ్రీనివాసన్ అలాగ. తనే సొంతంగా సినిమాలు నిర్మిస్తూ.. అందులో వీర లెవెల్లో బిల్డప్పులిస్తుంటాడు ఈ శ్రీనివాసన్. ఎప్పుడూ స్టార్ హీరోల మీద కామెంట్లు చేసే శ్రీనివాసన్ తాజాగా.. నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో మాత్రమే పోటీ.

మిగతా స్టార్లు ఎవ్వరూ నాకు పోటీ కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. తన కొత్త సినిమా 'వాంగ వాంగ' ఆడియో వేడుకలో శ్రీనివాసన్ తనదైన శైలిలో కామెడీ స్పీచ్ తో అలరించాడు. ఇక రజినీకాంత్ గురించి చెబుతూ.. నేను రజనీ సార్ ను ఎంతో ఆరాధిస్తాను. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. హార్డ్ వర్క్.. పట్టుదల ఈ స్థాయికి చేర్చాయి. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఎంతో కష్టపడ్డారు. నేను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నా. ఆయనొక్కడిని మాత్రమే నా కాంపిటీటర్ గా భావిస్తున్నా అని శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు.

English summary

Power Star Srinivasan sensational comments on Super Star