షుగర్ తగ్గించే పవర్ఫుల్ టిప్స్ ఏమిటో తెలుసా

powerful tips for preventing Diabetes

05:33 PM ON 13th February, 2017 By Mirchi Vilas

powerful tips for preventing Diabetes

షుగర్ బిపి లేకపోతే కోట్ల రూపాయల ఆస్తి వున్నట్టేనని చాలామంది అనేమాట. దీన్నిబట్టి ఈరెండు ఎంత ఇబ్బందికర వ్యాధుల్లో చేప్పక్కర్లేదు. ఇందులో డయాబెటిస్ మరీను. నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న జబ్బు షుగర్. దీని బారిన ఏటా మన దేశంలో 64 కోట్ల మంది పడుతున్నారు. టైప్-1, టైప్-2 ఏదైనా రెండింటి వల్ల రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండింటికీ ట్రీట్మెంట్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. టైప్-1 కు ఇంజెక్షన్లు ఇస్తే, టైప్-2కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్రమంలో ఏ తరహా షుగర్ వ్యాధి వచ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందులతోపాటు కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే దాంతో షుగర్ గణనీయంగా అదుపులోకి వస్తుంది. ఆ టిప్స్ ఏమిటో ఓసారి చూద్దాం.

1. ఉదయాన్నే పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

2.. దాల్చిన చెక్కకు రక్తంలోని చక్కెరను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ తరహా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మరిగాక వచ్చే ద్రవాన్ని వడకట్టి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చితీరుందని అంటున్నారు.

3. వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ రకమైన రసాయనం సమృద్ధిగా ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. నిత్యం పరగడుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే పచ్చిగా తింటుంటే దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

4. టైప్-1 డయాబెటిస్‌ను సమర్థవంతంగా నయం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జరిపిన పలు అధ్యయనాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు తేనె నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.

5. మీఠీ పత్తి అని పిలవబడే ఓ మొక్క ఆకులు కూడా బ్లడ్ షుగర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని సహజ సిద్ధమైన తీపి పదార్థంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు కూడా. దీంతో షుగర్ స్థాయిలు పెరగవు. పైగా ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లోకి వస్తాయి. దీన్ని 2011లో పలు అధ్యయనాలు నిరూపించాయి. ఈ మొక్కకు చెందిన పొడి కూడా మార్కెట్లో లభ్యమవుతోంది.

6. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కరివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔషధ కారకాలు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందుగా గుప్పెడు కరివేపాకు ఆకులను తింటే దాంతో చక్కెర వ్యాధి నయం అవుతుంది.

7. బీట్రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తింటున్నా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు.

8. పొడపత్రి ఆకు చూర్ణం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అర గంట ముందు నీళ్లలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా షుగర్ గణనీయంగా అదుపులోకి వస్తుంది.

9 . జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీలకర్ర పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఆ నీటిని మరిగించాలి. అలా నీరు అరగ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్రవాన్ని వడకట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగర్ వెంటనే అదుపులోకి వస్తుంది.

ఇది కూడా చూడండి: వంకాయ ఎంత తింటే ... అంత మంచిదా !

ఇది కూడా చూడండి: గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

English summary

Good news for diabetes patients there are 9 natural tips to prevent diabetes easily.