పోలీస్‌గా 'ప్రభాస్‌'!

Prabhas as a police officer

01:26 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Prabhas as a police officer

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్. అయితే ప్రభాస్‌ ఇప్పుటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాడు, కానీ ఒక్కసారి కూడా పోలీస్‌గా కనిపించలేదు. ప్రభాస్‌ అభిమానులకి కూడా ఈ లోటు ఉండిపోయింది. ఇప్పుడు ఆ లోటుని తీర్చడానికి 'రన్ రాజా రన్' ఫేమ్‌ సుజిత్‌ సిద్ధమయ్యాడు. ప్రభాస్‌ని ఒక పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా చూపించేందుకు మంచి కథని సిద్ధం చేశాడు. ఈ కథని విని ప్రభాస్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి -2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తవడానికి ఇంకా ఆరు నెలలైన పడుతుంది.

బాహుబలి చిత్రం షూటింగ్ అయిపోగానే ప్రభాస్ సుజిత్ సినిమా పై దృష్టి పెడతాడు. ప్రభాస్ కి అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకం పై నిర్మించనున్నారు.

English summary

Prabhas as a police officer in his upcoming movie. Run Raja Run fame Sujith is directing this movie.