ప్రభాస్‌ అన్నయ్యకు సంవత్సరం జైలు శిక్ష

Prabhas brother Prabodh jailed for one year

10:42 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Prabhas brother Prabodh jailed for one year

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి-2' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్‌ ప్రస్తుతం ఒక విషాదానికి గురైయ్యారు. అదేంటంటే ప్రభాస్‌ అన్నయ్య ఉప్పలపాటి ప్రభోద్‌ చెక్‌బౌన్స్‌ కేసులో ఇరుక్కున్నారు. అసలు విషయంలోకి వస్తే 41 లక్షల రూపాయల చెక్‌బౌన్స్‌ కేసులో విచారణ చేపట్టిన రాజేంద్రనగర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ప్రభోద్‌ కి ఏడాది పాటు జైలు శిక్షని విధించింది. దీనితో పాటు 87 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాను రెండు నెలల్లో కట్టేయాలని న్యాయస్థానం ఆర్డర్‌ వేసింది.

అయితే ఈ కేసు ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? సినిమా విషయంలో ఆ చెక్‌ ఇచ్చాడా లేక వ్యక్తిగత విషయంలో చెక్‌ ఇచ్చాడా అన్న విషయంపై క్లారిటీ లేదు. ప్రభోద్ గతంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'బిల్లా' సినిమా కి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా ప్రభాస్ సరసన అనుష్క, హన్సిక, నమిత హీరోయిన్లుగా నటించారు.

English summary

Prabhas elder brother Uppalapati Prabodh jailed for one year for Cheque bouncing case. And also 87 lakhs fine.