ప్రభాస్‌ కమీడియన్‌ కన్నుమూత...

Prabhas comedian passes away

12:10 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Prabhas comedian passes away

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'ఈశ్వర్‌' చిత్రంతో కమీడియన్‌ గా పరిచయమైన పొట్టి రాంబాబు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈశ్వర్‌ సినిమాలో తన కామెడీతో మెప్పించి ఆ తరువాత 40 కి పైగా సినిమాల్లో నటించిన పొట్టి రాంబాబు గారు మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ లో కన్ను మూశారు. 'పులిరాజా ఐపీఎస్‌' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న రాంబాబు మెదడులో రక్తం గడ్డ కట్టేయడంతో హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు చికిత్స పొందుతూ చనిపోయారు. చిన్న వయసులోనే అకాల మరణం పొందిన రాంబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలని మిర్చివిలాస్‌.కామ్‌ నుండి సంతాపం తెలుపుతున్నాం.

English summary

Comedian Potti Rambabu passes away today morning in Hyderabad hospital. He acted in Prabhas Eswar movie.