బాహుబలి 2 తరువాత మూడు సినిమాలు

Prabhas doing 3 movies after Bahubali 2

12:11 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Prabhas doing 3 movies after Bahubali 2

ఇండియన్ సినిమాలో దాదాపు మూడు సంవత్సరాలు పైనే ఒక సినిమాకి ఏ హీరో ఇవ్వనటువంటి కాల్షీట్లు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' చిత్రానికి ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన బాహుబలి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాహుబలి రెండవ భాగం చిత్రీకరణ పూర్తవుతున్న నేపధ్యంలో ప్రభాస్ తరువాత ప్రాజెక్టులపై అందరికళ్ళూ పడ్డాయి. ఫిలింనగర్ సమాచారం ప్రకారం మన ప్రభాస్ ఇప్పటికే మూడు స్క్రిప్ట్ లను ఒకే చేసినట్టు తెలుస్తుంది. పక్కా కథతో, పకడ్బందీ స్క్రిప్ట్ తో 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ ప్రభాస్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే.

బాహుబలి పూర్తవ్వగానే మొదట ఈ చిత్రంలోనే ప్రభాస్ నటిస్తాడు. ఇది కాక 'జిల్' సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కూడా ప్రభాస్ కి కధ చెప్పి ఒప్పించాడట. జిల్ లో హీరోయిజాన్ని భీభత్సంగా ఎలివేట్ చెయ్యడంతో ప్రభాస్ కి ఉన్న మాస్ అభిమానులకి ఇది నిజంగా పండగ. ఇవి రెండు కాక కృష్ణంరాజు గారు ఎంతో ముచ్చటపడి రాసుకున్న 'ఒక్క అడుగు' స్క్రిప్ట్ కూడా ప్రభాస్ చేయనున్నాడు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి బాహుబలి 2 తరువాత మన డార్లింగ్ ఫుల్ బిజీ మాట.

English summary

Prabhas doing 3 movies after Bahubali 2