కమీడియన్ ని తిట్టిన 'ప్రభాస్‌' ఫ్యాన్‌

Prabhas fan irritates comedian Chalaki Chanti

03:27 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Prabhas fan irritates comedian Chalaki Chanti

జబర్‌దస్త్‌ కామెడీషో ద్వారా పాపులర్‌ అయిన కమీడియన్‌ చలాకీ చంటి. ఫేస్‌బుక్‌ లో ప్రభాస్‌ ఫ్యాన్‌ చలాకి చంటి మీద నీచమైన పోస్ట్‌ పెట్టాడు. ఖమ్మం జిల్లా ఇల్లెండు గ్రామానికి చెందిన యువకుడు చంటి పై ఫేస్‌బుక్‌ లో నీచమైన పోస్ట్‌లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. తమ ఫేవరెట్‌ హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేయడం వల్ల ఇదంతా చేశారు. దీని వల్ల విసుగు చెందిన చంటి ఇల్లెండు పోలీస్‌ స్టేషన్‌లో కంప్లెయింట్‌ నమోదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఈ యువకుడిని అరెస్ట్‌ చేశారు. వేరే పోస్ట్‌లలో ఉన్న కామెంట్స్‌ని తను మళ్ళీ పోస్ట్‌ చేశానని పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ లో ఆ యువకుడు తెలిపాడు. చివరికి చంటి తను ప్రభాస్‌ను అగౌరవ పరిచే విధంగా ఏమీ చేయలేదని ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు.

English summary

Prabhas fan irritates comedian Chalaki Chanti by with his comments on social media. Chalaki Chanti filed a case on that boy in Police Station.