150 పెరిగాడు

Prabhas gained 17 kgs for Amarendra Baahubali role

11:04 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Prabhas gained 17 kgs for Amarendra Baahubali role

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తను నటించే సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతాడు. బాహుబలి లో 'శివుడు' పాత్ర కోసం ప్రభాస్‌ ఏకంగా 130 కిలోల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌ 'బాహుబలి -2' కోసం మరో 17 కేజీలు పెరగనున్నాడు. అంటే దాదాపు 150 కేజీలు బరువు అన్నమాట. శివుడు తండ్రైన 'అమరేంద్ర బాహుబలి' పాత్ర కోసమే ప్రభాస్‌ ఇంత సాహసం చేస్తున్నాడు. విదేశాల నుండి స్పెషల్‌ జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ తెప్పించుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడట ప్రభాస్‌. దీనికోసం ప్రభాస్‌ ఒక మెనూని కూడా తయారు చేసుకున్నాడట. వెజ్‌ మరియు నాన్‌వెజ్‌ను సరిసమానంగా తీసుకుంటున్నాడట.

బ్రేక్‌ఫాస్ట్‌లో 42 ఎగ్‌వైట్స్‌, పావుకిలో చికెన్‌, పండ్లు తీసుకుంటున్నాడట. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బ్రొకలి మరియు పాస్టా. ఆ తర్వాత సాయంత్రం వర్కౌట్‌ చేశాక సగం స్కూప్‌లో ప్రొటీన్‌ పౌడర్‌ని తీసుకుని సూప్‌తో గానీ పాలతో గానీ తీసుకుంటున్నాడట. వీటితో పాటు రోజు ఉదయం-సాయంత్రం గంటన్నర పాటు వ్యాయామాలు చేస్తున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్‌ తనపాత్ర గొప్పగా రావడం కోసం ఎంతైనా కష్టపడగలడని తెలుస్తుంది.

English summary

Young Rebel star Prabhas gained 17 kgs for Amarendra Baahubali role in Baahubali movie. This movie is directing by S.S. Rajamouli. Anushka and Tamanna is romancing with Prabhas in this movie.