బాలీవుడ్ లో 'ప్రభాస్' విలన్ గా ఎంట్రీ

Prabhas giving entry as a villan in bollywood

05:18 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Prabhas giving entry as a villan in bollywood

'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ ని బాలీవుడ్ లో కూడా నటించమని అడుగుతన్నారు. హిందీ లో హిట్ సీరీస్ అయిన ధూమ్-4 లో ప్రభాస్ ని విలన్ గా నటించమని ఆ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా మరియు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రభాస్ ని కోరారట. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తాడట. హృతిక్ కి ధీటుగా ప్రభాస్ అయితేనే బాగుంటుందని ఆ చిత్ర మేకర్స్ అభిప్రాయమట. అయితే ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి -2' చిత్రీకరణలో బిజీ గా ఉండడంతో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. త్వరలోనే ఈ విషయం పై ప్రభాస్ క్ల్యారిటీ ఇస్తాడని సమాచారం.

English summary

Prabhas giving entry as a villan in hindi cinema Dhoom -4. Hritik Roshan is acting as a hero in this movie. Vijay Krishna Acharya is directing this movie.