ఆ చాన్స్‌ మళ్ళీ ప్రభాస్‌కే దక్కిందా..

Prabhas got the chance to act in bhaktha kannappa

04:12 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Prabhas got the chance to act in bhaktha kannappa

రెబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో గొప్ప వ్యక్తిగా నిలిచాడు. ఇతడు నటించిన ఎన్నో చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. అతని కెరీర్‌లో ఒక మైలు రాయిగా నిలిచిన చిత్రం 'భక్త కన్నప్ప'.

ఆరోజుల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం భక్త కన్నప్ప. ఈ చిత్రం గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ లో కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా వ్వవహరించడమే కాకుండా పరమ శివభక్తుడుగా ఆ చిత్రంలో నటించి అందరి మన్ననలను పొందాడు. ఈ కధని ముళ్ళపూడి వెంకటరమణ రచించగా, బాపు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్‌ రూపంలో ఈతరం ప్రేక్షకులకు అందించాలని కృష్ణంరాజు కోరుకుంటున్నారు.

ఈ మధ్యలో మరో శివ భక్తుడైన తనికెళ్ళ భరణి కన్నప్ప కధను సునీల్‌తో తీస్తానని వాపోయారు. ఆ తరువాత విష్ణు అనుకున్నారు కాని 'భక్త కన్నప్ప'కు మొదట్లోనే బ్రేక్స్‌ పడ్డట్లు సమాచారం. మొత్తానికి భరణి విష్ణుతో తీద్దామనుకున్న భక్త కన్నప్ప ఆగిపోయిందట. దీంతో పాత చిత్రం నిర్మాత మరియు హీరో అయిన కృష్ణంరాజు ఇప్పుడు ప్రభాస్‌ తో తీయాలని కన్నప్ప కధను సిద్దం చేస్తున్నాడని సమాచారం.

'బాహుబలి-2' చిత్రం తరువాత తన సొంత ప్రొడక్షన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్‌ వేసుకున్నారట. భక్త కన్నప్ప ను అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించాలని రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ప్లాన్‌. బాహుబలిలో అదరగొట్టిన ప్రభాస్‌ మరి ఈ కన్నప్ప చిత్రంలో ఎలా అలరిస్తాడో చూడాలి.

1/6 Pages

1976  లో రిలీజ్ అయిన భక్త కన్నప్ప చిత్రం లో రెబల్ స్టార్  కృష్ణంరాజు హీరోగా నటించగా అతడి సరసన వాణిశ్రీ నటించారు. ఈ చిత్ర దర్శకుడు బాపు 

English summary

One film which originates from the past is “BHAKTHA KANNAPPA” and it gave an altogether different scope of fame to revolt star Krishnamraju. Presently, the dialog is on about its redo with youthful renegade star Prabhas in it.