'సింగం 3' లో ప్రభాస్?!

Prabhas guest role in Singam 3

04:56 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Prabhas guest role in Singam 3

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలాంటి ఆ హీరో వేరే ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఆ సినిమాకి బోలెడంత హైప్ క్రియేట్ అవుతుంది. అదే ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తే ఇంక ఆ రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితే నెలకొంది. తమిళ స్టార్ హీరో సూర్య గతంలో 'యముడు', 'సింగం' సినిమాలు తీసి హిట్ కొట్టిన విషయం విదితమే! అయితే ఆ సినిమాలకు సీక్వల్ గా తాజాగా నటిస్తున్న చిత్రం 'సింగం 3'. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు జతకట్టనున్నారు. ప్రస్తుతం 'సింగం 3' షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని తలకోన అడవుల్లో జరుగుతోంది. ప్రభాస్ బాహుబలితో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇప్పుడు ఈ సినిమాలోయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కు చెప్పడం జరిగింది, ఓకే చేయడం మాత్రమే మిగిలి ఉంది. మరి ప్రభాస్ ఓకే చెప్తే 'సింగం 3' లో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

English summary

Prabhas guest role in Singam 3