ఖైదీని బాహుబలి ఎందుకు కలిసినట్టు?

Prabhas in Khaidi no. 150 movie sets

12:13 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Prabhas in Khaidi no. 150 movie sets

డిఫరెంట్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. 'ఖైదీ నంబరు 150'లో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 'బాహుబలి' చిత్రంతో వెండితెరపై విజువల్ వండర్ ను ఆవిష్కరించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అని తెల్సిందే.

అయితే ఇటీవల కథానాయకుడు ప్రభాస్ తో కలిసి రాజమౌళి 'ఖైదీ నంబర్ 150' సెట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. చిత్ర విశేషాలను రాజమౌళి, ప్రభాస్ లతో పంచుకున్నారు. ప్రభాస్ ను చిరంజీవి ఆప్యాయంగా హత్తుకున్న దృశ్యాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

English summary

Prabhas in Khaidi no. 150 movie sets