'స్పిరిట్ ఆఫ్‌ చెన్నై' లో ప్రభాస్‌!!

Prabhas in spirit of chennai

03:17 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Prabhas in spirit of chennai

తమిళ హీరో విక్రమ్‌ 'స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై' అనే టైటిల్‌తో ఒక వీడియో సాంగ్‌ ని రూపొందిస్తున్నారు. చెన్నైలో సంభవించిన వరదలను విజువల్స్‌తో ఒక వీడియోను తయారు చేసి 6 నిముషాల నిడివితో ఈ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు చెన్నై భాధితులకి తను వంతు సాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోలో చెన్నై వరదలకి సాయం చేసిన హీరోలు, వాలంటీర్‌లు కనిపించనున్నారు. ఈ వీడియోలో కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, మాలీవుడ్‌ నుండి నివిన్‌ పాలీ, కోలీవుడ్‌ నుండి విజయ్‌, సూర్య కనిపించబోతుండగా, టాలీవుడ్‌ నుండి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కనిపించనున్నారు.

ఈ వీడియోని రిపబ్లిక్‌ డే రోజున జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్‌ షూటింగ్‌ చెన్నైలో 'ధక్షిణ భారత్‌ హిందీ ప్రచార సభ' ప్రాంగణం ఇటీవలే మొదలైంది. జనవరి 10న ఈ సాంగ్‌ షూటింగ్‌ పూర్తవుతుంది.


&

English summary

Prabhas in spirit of chennai video song.