'లోఫర్'లో ప్రభాస్‌!!

Prabhas is a chief guest for Loafer audio function

02:23 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Prabhas is a chief guest for Loafer audio function

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ 'ముకుంద' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసాడు. ఆ తరువాత క్రిష్‌ రూపొందించిన సూపర్‌హిట్‌ చిత్రం 'కంచె' లో తన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు ఈ మెగా హీరో నటిస్తున్న తాజా చిత్రం'లోఫర్‌' ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించగా దిశా పటాని హీరోయిన్‌గా పరిచయమవుతుంది. సునీల్‌ కాశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌ 7న రిలీజ్‌ చెయ్యడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి ముందుగా మెగాస్టార్‌ ముఖ్య అతిధిగా వస్తారని భావించారు అందరూ కానీ ఇప్పుడు ఈ ఆడియో వేడుకకి 'యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌' ముఖ్యఅతిధిగా రాబోతున్నారు.

బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్‌ చిత్రాలతో పూరీ జగన్నాధ్‌కి, ప్రభాస్‌కి మధ్య ఉన్న స్నేహం వల్లే ప్రభాస్‌ని అడిగిన వెంటనే వస్తానని అంగీకరించారని సమాచారం. డిసెంబర్‌ 18 న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్‌ నిర్మించారు.

English summary

Prabhas is a chief guest for Loafer audio function. Puri Jagannadh directed the loafer movie.