పెదనాన్న డైరెక్షన్‌లో ప్రభాస్..

Prabhas is acting in Krishnam Raju direction?

03:34 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Prabhas is acting in Krishnam Raju direction?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ తన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు, కాసులు కురిపించాయి. ఇదిలా ఉండగా ప్రభాస్‌ ప్రస్తుతం బాహుబలి-2 కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ చిత్రం ఘాటింగ్‌ డిసెంబర్‌ 15 నుండి మొదలుకానుంది. ఇది అయ్యేంత వరకు ప్రభాస్‌ మరే సినిమాలో నటించడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే -2 తరువాత ప్రభాస్‌ ఏ సినిమాలో నటిస్తాడన్న ఆసక్తి మాత్రం నెలకొంది. రన్‌రాజారన్‌ ఫేమ్‌ సుజీత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇది కాకుండా ప్రభాస్‌ పెదనాన్న అయిన కృష్ణంరాజు ప్రభాస్‌ని డైరెక్టె చెయ్యాలనుకుంటున్నారు. అందుకోసం కృష్ణంరాజు సొంత బ్యానర్‌ 'గోపికృష్ణ మూవీస్‌' పతాకంపై 'దందా' అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేసారని సమాచారం. అయితే ఈ చిత్రానికి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారా లేక వేరే ఎవరయినా డైరెక్ట్‌ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది..

English summary

Prabhas is acting in Krishnam Raju direction. For this movie Krishnam Raju registered Dandha title for movie.