ప్రభాస్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా'!

Prabhas is chief guest for Express Raja audio launch

03:07 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Prabhas is chief guest for Express Raja audio launch

రన్ రాజా రన్‌, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరో శర్వానంద్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'. మిర్చి, రన్‌ రాజా రన్‌, జిల్‌, భలేభలే మగాడివోయ్ వంటి వరుస హిట్స్‌ తో దూసుకుపోతున్న యూవీ క్రియేషన్స్‌ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' ఫేమ్‌ మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా శర్వానంద్‌ సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌ లోని శిల్పకళావేదిక లో అంగరంగవైభవంగా విడుదల చేయబోతున్నారు.

యూవీ క్రియేషన్స్‌ అధినేతలకి బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఈ ఆడియోకి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఈ ఆడియోకి ప్రభాస్‌ అభిమానులు భారీగా తరలివస్తుండడంతో యూవీ క్రియేషన్స్‌ సంస్ధ భారీగా ఏర్పాట్లు చేసింది. ఎక్స్‌ప్రెస్‌ రాజా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలవుతుంది.

English summary

Prabhas is chief guest for Express Raja audio launch. Sarwanand and Surabhi acted in lead roles in this film. Venkatadri Express fame Merlapaka Gandhi is directed this film.