అనుష్క ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబొతున్న ప్రభాస్?

Prabhas love marriage with Anushka friend

05:47 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Prabhas love marriage with Anushka friend

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబల్ బ్యాచలర్ ఎవరు అని అడిగితే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆరున్నర అడుగులు అందగాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో కోసం అమ్మాయిలు పడి చస్తారు. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్నంత అమ్మాయిల ఫాలోయింగ్ ఏ హీరోకి లేదంటే ప్రభాస్ అంటే అమ్మాయిలకి ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలా మంది అమ్మాయిలు ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా ఆ అదృష్టవంతురాలు ఎవరా? అని తెలుసుకుందామని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం సినిమా ల్ బిజీ లో పడి పెళ్లి చేసుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి -2' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి: సూర్యాస్తమయం తరువాత వెళ్ళారో... రాయి అయిపోతారు

ఈ చిత్రం షూటింగ్ అయిపోయాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు, దాని కోసం ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు గారు ఇప్పటికే వధువు ను వెతకడం మొదలు పెట్టేశారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ప్రభాస్ ఒక అమ్మాయితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని సమాచారం. ఆ అమ్మాయి ఎవరో కాదు అనుష్క కి బెస్ట్ ఫ్రెండ్ అట. 'బాహుబలి' షూటింగ్ సమయంలో అనుష్క తన ఫ్రెండ్ ని ప్రభాస్ కి పరిచయం చేసిందట, అప్పుడే ప్రభాస్ కి ఆ అమ్మాయికి మధ్య మంచి స్నేహం ఏర్పడిండట. ఆ అమ్మాయిని ప్రభాస్ తరువాత డిన్నర్ కి కూడా పిలిచాడట, అప్పుడే ప్రభాస్ ఆ అమ్మాయిని ప్రపోజ్ కూడా చేశాడట.

ఇది కూడా చదవండి: శృంగార కథానాయికలు అసలు ఎన్నిరకాలో తెలుసా?

దానికి ఆ అమ్మాయికి వెంటనే అంగీకరించడం కూడా అయిపోయిందట. ఈ విషయం ఇద్దరి ఇంట్లో తెలియడం వారు అంగీకరించడం కూడా అయిపోయిందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary

Prabhas love marriage with Anushka friend. Prabhas fall in love with Anushka's friend. And now he is ready to marry her.