బ్రేకింగ్ న్యూస్: వైజాగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్!

Prabhas marriage fixed with Vizag girl

11:20 AM ON 17th October, 2016 By Mirchi Vilas

Prabhas marriage fixed with Vizag girl

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ 'బాహుబలి' సినిమా కోసం నాలుగు సంవత్సరాల కెరీర్ ను వదులుకోవడంతో పాటు తన పెళ్లిని కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. తాజాగా 'బాహుబలి' రెండవ పార్ట్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే 'బాహుబలి' చిత్రీకరణ పూర్తి కాబోతుంది. ఈ సమయంలో బాహుబలుడు ప్రభాస్ వివాహం గురించి మరోసారి మీడియాలో వార్తలు తారా స్థాయిలో వస్తున్నాయి. గతంలో ప్రభాస్ భీమవరంకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదు అని, పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదు అని ప్రభాస్ కొన్నాళ్ల క్రితం చెప్పుకొచ్చాడు.

తాజాగా 'బాహుబలి' పూర్తి కానుండటంతో ప్రభాస్ కు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణంరాజు సన్నిహితులతో ప్రభాస్ కు మంచి అమ్మాయిని చూడమని పురమాయించినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. బాహుబలి విడుదలకు ముందే ప్రభాస్ ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదల తర్వాత పెళ్లి జరుగనున్నట్లుగా సమాచారం. మొత్తానికి ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతున్నాడు.

English summary

Prabhas marriage fixed with Vizag girl