ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాకి కోటి వ్యూలు

Prabhas Rebel Movie Hindi Version Crosses One Crore Views

05:05 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Prabhas Rebel Movie Hindi Version Crosses One Crore Views

'బాహుబలి' చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కి నార్త్‌లో విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోతుంది. 'బాహుబలి' ఘన విజయం సాధించడంతో ఉన్న క్రేజ్‌ అమాంతం రెట్టింపు అయింది. దీనితో ప్రభాస్‌ పాత చిత్రాలన్నీ నార్త్‌లో విడుదల చేసి క్యాష్‌ చేసుకుందామని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ వ్యూహంలోనే ప్రభాస్‌ నటించిన ఒక ఫ్లాప్‌ చిత్రాన్ని హిందీలో డబ్‌ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. అది మరే సినిమానో కాదు. రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన 'రెబల్‌' చిత్రాన్ని హిందీలో డబ్‌ చేసి విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ సరసన తమన్నా, దీక్షా సేధ్‌ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఇది అట్టర్‌ ప్లాప్‌ అయినా హిందీ ప్రేక్షకులు మాత్రం దీనిని ఎగబడి చూస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే ఏకంగా కోటివ్యూలు రావడం గమనార్హం. ఒక ఫ్లాప్‌ చిత్రాన్ని రికార్డు స్థాయిలో చూస్తున్నారంటే నార్త్‌లో ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

English summary

Rebel Star Prabhas has become popular in All Over India with Bahubali movie.Recently Prabhas Rebel movie was dubbed into Hindi and released in youtube and this movie got good response and it crosses 1 crore views.Intresting fact that Rebel movie became disaster in Telugu.