5న్నర కోట్లు ఇస్తామంటే పొమ్మన్నాడు

Prabhas Rejected 5 Crore Fitness Brand Endorsement Offer

10:34 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Prabhas Rejected 5 Crore Fitness Brand Endorsement Offer

డిసిప్లిన్ తో పాటు మాంచి ఫిజిక్ వున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. గతేడాది వరకు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్.. బాహుబలి రిలీజ్ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయింది. దేశవ్యాప్తంగా అయితే, ప్రభాస్ ఓ బ్రాండ్ అయిపోయాడు. ఇంతగా అందరినీ ఆకట్టుకోవడంలో, ప్రభాస్ ఫిజిక్ ఫిట్నెస్ కీలకం అనే సంగతి స్పెషల్ గా ప్రస్తావించి తీరాలి.

ఫిట్నెస్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు. అంతగా తన దేహధారుడ్యాన్ని కాపాడుకుంటున్నాడు. బాహుబలి మూవీలో రెండు పాత్రల కోసం ప్రభాస్ పడుతున్న కష్టం ఏ రేంజ్ లో ఉందో జనాలు వింటూనే ఉన్నారు.. చూస్తూనే ఉన్నారు. అలాంటి రెబల్ స్టార్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఓ ఫిట్నెస్ బ్రాండ్ ప్రభాస్ ని అప్రోచ్ అయింది. తమ ప్రొడక్ట్స్ కి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరింది. ఇందుకోసం ఏకంగా 5.5 కోట్ల రూపాయల ను ఆ కంపెనీ ఆఫర్ చేసింది.

ఇంతటి ఆఫర్ వస్తే సాధారణంగా ఎవరైనా ఎందుకు వదులుకుంటారు. వెంటనే తలూపేస్తారు. కానీ.. ప్రభాస్ మాత్రం అలా చేయలేదు. అదే ప్రభాస్ లో ఉన్న సంథింగ్ సంథింగ్. అందుకే తను ఇప్పుడు బాహుబలి2 పై తప్ప మరే షూట్ పైనా దృష్టి పెట్టలేనని సున్నితంగా చెప్పి పంపించేశాడు. బాహుబలి ది కంక్లూజన్ టాప్ రేంజ్ కి చేరాలంటే ప్రభాస్ పై ఉన్న క్యూరియాసిటీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. అందుకే ఇలా ఐదున్నర కోట్లు ఇంటికొస్తానంటే కాదు పొమ్మన్నాడు ప్రభాస్.

ఇవి కూడా చదవండి:సినిమా ఛాన్స్ కోసం ట్రై చేసే వారికి డైరెక్టర్ మారుతి బంపరాఫర్!

ఇవి కూడా చదవండి:వ్యభిచారం చేస్తూ దొరికేసిన హీరో రామ్ సైడ్ హీరోయిన్!

English summary

Tollywood Rebel Star Prabhas got very good craze in National Level by Bahubali movie and now he became the fitness inspiration to many people and now one of the Fitness Brand company approached prabhas to promote their brand but Prabhas rejected that offer worth 5.5 crores.