'గరం'గా ప్రభాస్!!

Prabhas released Garam teaser

04:26 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Prabhas released Garam teaser

డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ తనయుడు ఆది నటించిన తాజా చిత్రం 'గరమ్‌'. పెళ్లైన కొత్తలో, ప్రవరాఖ్యుడు వంటి చిత్రాలు తెరకెక్కించిన 'మదన్‌' ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆది సరసన ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతులమీదుగా విడుదల చేయించారు. హీరో ఆది, ఆది తండ్రి సాయికుమార్‌, గరం చిత్ర యూనిట్‌ కలిసి హైదరాబాద్‌ లో ప్రభాస్‌ నివాసం దగ్గరకు వెళ్లి ముందుగా బాహుబలి విజయం సాధించినందుకు ప్రభాస్‌కి కృతజ్ఞతలు చెప్పారు.

ఆ తరువాత ప్రభాస్‌ చేతుల మీదుగా 'గరం' టీజర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ ఆది ఒక మంచి నటుడు, అంతేకాదు నాకు మంచి మిత్రుడు కూడా, గరం టీజర్‌ చూసాను ఇందులో ఆది ఫ్రెష్‌లుక్‌ లో కనిపిస్తున్నాడు, ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గరం డైరెక్టర్‌ మదన్‌ గారి గురించి చాలా విన్నాను, రాజమౌళి గారు కూడా మదన్‌ గురించి చాలా చెప్పారు అని ప్రభాస్‌ అన్నారు. గరం ని ఆది తండ్రి సాయికుమార్ నిర్మించారు.

English summary

Prabhas released Garam teaser which was acted in this film is Aadi and Adah Sharma. This movie is directed by Madan.