బాహుబలితో కొన్ని మిస్ అయ్యాడు.. అందుకే ఇప్పుడు స్పీడ్ పెంచాడు

Prabhas upcoming movies with these directors

11:14 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Prabhas upcoming movies with these directors

మొదట్లో కొన్ని చిత్రాలు అటు ఇటు ఆడినా, 'ఛత్రపతి' సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇక బాహుబలి తో తారాస్థాయికి చేరాడు. ఈ సినిమాకి దాదాపు మూడేళ్లపాటు విలువైన సమయాన్ని ప్రభాస్ వెచ్చించాడు. అయితే, ఒక్క బాహుబలి పార్ట్ 1తోనే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుని, మాంచి కిక్కు పొందినా, ఆ టైంలో ప్రభాస్ చాలా మూవీస్ చేసే ఛాన్స్ మిస్సయ్యాడట. ఇక బాహుబలి ద కంక్లూజన్ షూటింగ్ కి బైబై చెప్పేసిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ కాదు.. ఒకేసారి రెండు సినిమాలు చేసెయ్యబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ మూడేళ్లలో మిస్ అయిన వాటన్నిటినీ ఒడిసిపట్టుకోబోతున్నాడు.

ఓ రెండు సినిమాలు తన సన్నిహితుల సంస్థ అయిన యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే చేయబోతున్నాడని అంటున్నారు. 'రన్ రాజా రన్' సినిమాతో మెగాఫోన్ పట్టి, సూపర్ హిట్ కొట్టిన సుజిత్ తో ఒక సినిమా, 'జిల్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ కుమార్ కథ, కథనాలతో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుజిత్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ హీరోగా కనపడతాడు. అయితే రాధాకృష్ణ మూవీ కోసం ప్రేమికుడిగా మారనున్నాడని టాక్. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాతో ఓ కొత్త భామని హీరోయిన్ గా పరిచయం చేస్తారట. ఇక సుజిత్ సినిమాలో ప్రభాస్ సరసన ఎవరిని హీరోయిన్ గా పెట్టాలన్న దానిపై వేట కొనసాగుతోంది. మొత్తానికి యంగ్ రెబెల్ స్టార్ వరుస పెట్టి, సినిమాలు ఒప్పేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నా, తగిన కధలు లేనిదే కుదరదని మాత్రం చెప్పేస్తున్నాడట.

English summary

Prabhas upcoming movies with these directors