ప్రభాస్ సౌత్ ఇండియా రికార్డు

Prabhas Wax statue at Madame Tassauds

03:20 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Prabhas Wax statue at Madame Tassauds

అవును, మన ప్రభాస్ అరుదైన రికార్డును సాధించాడు. సౌత్ ఇండియాలోనే ఇది ఓ రికార్డు. అదేమంటే, బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియమ్ లో ప్రభాస్ మైనపు బొమ్మ వచ్చే ఏడాది కొలువుదీరనుంది. మహాత్మాగాంధీ, నరేంద్రమోడీ, మైకేల్ జాక్సన్, మహమ్మద్ అలీ, అమితాబ్ బచ్చన్, ఏంజెలీనా జోలీ లాంటి ప్రముఖుల మైనపు బొమ్మల చెంత ప్రభాస్ మైనపు బొమ్మ చేరబోతోంది. మొత్తానికి దక్షిణాదిలో ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి సెలబ్రిటీ ప్రభాస్ కావటం విశేషం. జక్కన్న రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి లో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, శివుడు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయాడు.

ముఖ్యంగా బాహుబలి పాత్రలో ప్రభాస్ నటన, పలికించిన వీరత్వం అద్భుతం. అందుకే ప్రేక్షకులు జయహో బాహుబలి అన్నారు. అమరేంద్ర బాహుబలి పాత్రతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ క్లస్టర్ ఫర్ మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రధాన కార్యదర్శి, మేడమ్ టుస్సాడ్ మ్యూజియం ప్రధాన కార్యదర్శి అయిన నోప్పడోన్ ప్రాపింపన్ట్ మాట్లాడుతూ ప్రభాస్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి అని పేర్కొన్నాడు. భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్లపరంగా ప్రపంచంలో మూడోస్థానంలో, భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన బాహుబలి- ది బిగినింగ్ లో నటించిన ప్రభాస్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ఆయన ప్రతిమను కోరుతూ మాకు ప్రపంచం నలుమూలల్లోని అభిమానుల నుండి అభ్యర్థనలు వెల్లువెత్తాయి.

1/4 Pages

ప్రభాస్ స్పందిస్తూ.. 

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో స్థానం దక్కడం చాలా ఆనందంగా ఉంది. అభిమానుల వల్లే ఇది సాధ్యమైంది. వాళ్లు నాపై చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడ్ని. ముఖ్యంగా బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన మా గురువు రాజమౌళి గారికి ధన్యవాదాలు అన్నారు.

English summary

Prabhas Wax statue at Madame Tassauds