అక్రమాస్తుల విషయంలో కోర్టుకొచ్చిన ప్రభుదేవా

Prabhu Deva Attends To Nampally Court

12:55 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Prabhu Deva Attends To Nampally Court

నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు ప్రభుదేవా. ఈయన్ని ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌గా పిలుస్తారు. తెలుగు, తమిళం, హిందీ వంటి ఎన్నో భాషల చిత్రాల్లో పాటలకి ప్రభుదేవా కొరియోగ్రఫీ కంపోజ్‌ చేశారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, పౌర్ణమి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా, హిందీలో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ చాలా చిత్రాలకి దర్శకత్వం వహించి విజయాలను అందుకున్నాడు. అయితే ప్రభుదేవా ప్రస్తుతం అక్రమాస్తుల కేసుకై హైదరాబాద్‌లోని నాంపల్లి లో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు ప్రభుదేవా పైన కాదు ఒక వ్కక్తి కోసం ప్రభుదేవా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

అసలు విషయంలోకి వస్తే ప్రభుదేవా తెలంగాణాలోని మెదక్‌ జిల్లాకి చెందిన హరిప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర ప్రభుదేవా ఒక భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఇప్పుడు హరిప్రసాద్‌ పై అక్రమాస్తుల కేసులో సిబిఐ అధికారులు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారించగా ప్రభుదేవా ఆ భూమిని కొన్నట్లు తేలింది. దీనితో అసలు హరిప్రసాద్‌ చెప్పేది నిజమో కాదో అని తెలుసుకోవడానికే ప్రభుదేవాని ఒక సాక్షిగా కోర్టుకి పిలిపించారు. కోర్టుకు వచ్చిన ప్రభుదేవా నేను నా మేనేజర్‌ ద్వారా ఆ భూమిని కొన్నాను. అంతకు మించి దాని గురించి మరే విషయం తెలీదు అని ప్రభుదేవా వివరించాడు.

English summary

Actor,Dancer,Director Prabhu Deva was attended to Nampally court on the case of illegal Assets.Previously Prabhu Deva Purchased a land from a person named Hari Prasad.Now Hari Prasad was taken into CBI custody in Illegal Assets case.So Prabhu Deva asked to attend in Nampally court and thats the reason behind that.