ఎన్టీఆర్‌ కి డ్యాన్స్‌ కంపోజ్‌ చెయ్యనన్న ప్రభుదేవా

Prabhu Deva rejected to compose dance for Ntr

06:15 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Prabhu Deva rejected to compose dance for Ntr

'నాన్నకుప్రేమతో' వంటి ఘన విజయం తరువాతే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం 'నాన్నకుప్రేమతో'. 'శ్రీమంతుడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌ మొదలైన ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసం కొరటాల శివ చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడట. ఈ పాటని ముంబాయ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నారట.

ఈ పాట కోసం ప్రభుదేవా కొరియోగ్రాఫీ చెయ్యబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుదేవా ఈ పాటకి నేను కొరియోగ్రాఫీ చెయ్యడం లేదని తప్పుకున్నాడట. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుదేవా తాను డైరెక్ట్‌ చేసే సినిమాలకి మాత్రమే కొరియోగ్రాఫీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడట. దీనితో 'జనతా గ్యారేజ్‌' నుండి ప్రభుదేవా తప్పుకోవడంతో ఆ అవకాశం ప్రభుదేవా సోదరుడైన రాజు సుందరాన్ని వివరించింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌కి రాజు సుందరం మంచి కొరియోగ్రాఫీ ఇచ్చే పనిలో ఉన్నాడని సమాచారం. 

'జనతా గ్యారేజ్‌' సినిమా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు.

1/9 Pages

ఎన్టీఆర్ క్యారక్టర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో ఐఐటి స్టూడెంట్ గా నటిస్తున్నారు.

English summary

Indian Michael Jackson Prabhu Deva rejected to compose dance for Ntr in Janatha Garage introduction song.