అభిషేక్ హీరో .. కోనా వెంకట్ కథ.. ప్రభుదేవా డైరెక్షన్

Prabhu deva to remake gilli with Abhishek Bacchan

10:58 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Prabhu deva to remake gilli with Abhishek Bacchan

టాలీవుడ్ రచయిత కోనా వెంకట్ కథతో ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారట. నవంబరులో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘ఇది ఓ కొత్త కథ, ఆయన(అభిషేక్ )కి చాలా నచ్చింది. చిత్రాన్ని తానే నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు’ అని కోనా వెంకట్ తెలిపారు. శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘మామ్ ’ చిత్రానికి కూడా కోనానే కథను అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బోనీ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో కోనా వెంకట్ డైలాగ్స్ అందించిన తెలుగు ‘రెడీ’ చిత్రాన్ని బాలీవుడ్ లో అదే టైటిల్ తో సల్మాన్ ఖాన్ , అసిన్ జంటగా రీమేక్ చేశారు.

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: హీరోలు వారి మేనరిజం

English summary

Prabhu deva to remake gilli with Abhishek Bacchan.