మెగాస్టార్ కు షాకిచ్చిన ప్రభుదేవా ...

Prabhudeva To Take 1 Crore For Megastar 150th Movie

10:46 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Prabhudeva To Take 1 Crore For Megastar 150th Movie

ఒక్కోసారి ఎవరు ఎవరికీ జర్క్ ఇస్తారో తెలీదు. షాకవ్వడం ఎవరి వంతు అవుతుందో చెప్పలేం. ఇప్పుడు అది మెగాస్టార్ చిరంజీవి వంతు అయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ఖైదీ నం 150 . రాజకీయ ప్రవేశం తరువాత చిరు నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం కావడం, పైగా ఇది చిరు 150 చిత్రం కావడం దీనికి కారణం. ఈ కారణంతోనే ఈ చిత్రానికి టైటిల్ గా ఖైదీ నం 150 అని ఖరారు చేసినట్లు చిరు తనయుడు రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి సంబంధించి మెగాస్టార్ కు డ్యాన్స్ కంపోజ్ చేయడానికి ప్రముఖ డ్యాన్సర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సిద్ధమయ్యాడని గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. ఆ వార్తలు నిజమే అయినప్పటికీ.. ప్రభుదేవా మాత్రం చిరంజీవికి షాక్ ఇచ్చాడని టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా ప్రభుదేవా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా, నటుడిగానే కాక ప్రొడ్యూసర్ గా సైతం రాణిస్తున్నాడు. ఇక డ్యాన్స్ అంటే చెప్పనక్కర్లేదు. దీన్నిబట్టి అతడి రేటును అంచనా వేయవచ్చు. అయితే, అంచనాలకు సైతం అందని రీతిలో మెగా చిత్రానికి డిమాండ్ చేశాడని, అది కూడా అక్షరాలా రూ కోటి రూపాయలని ఫిలింనగర్ వార్త. ఈ రేటు చూసి మెగాస్టార్, చరణ్ ఆశ్చర్యపోయారట. రేటు గురించి మాట్లాడుకోకుండా అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో, ప్రభు అడిగినంత ఇవ్వడానికే తండ్రికొడుకులు నిశ్చయించుకున్నారట. ఈ చిత్రంలో ప్రభుదేవా రెండు పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసేందుకు ఇప్పటికే పని మొదలు పెట్టినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ పాటలు ఏ రేంజ్ లో వుంటాయో చూడాలి. అభిమానులు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:'అన్నమయ్య' సినిమా మొత్తం అన్నీ తప్పులే... షాకింగ్ న్యూస్

ఇవి కూడా చదవండి:మెగా మూవీకి టైటిల్ ఖరారు!

English summary

Indian Michael Jackson Prabhudeva was presently in full form and he was directing and producing some films also and now Prabhudeva was contacted by Mega Star Chiranjeevi for his 150th film, Prabhudeva demanded 1 crore for this movie.