భయపడుతున్న ప్రభుదేవా - ఇంతకీ ఏమైంది?

Prabhudeva worrying about his age

11:02 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Prabhudeva worrying about his age

కెరీర్ నడిచినంత కాలం బానే ఉంటుంది. ఓ రేంజ్ అయ్యాక వెనక్కి తిరిగి చూస్తే, మళ్ళీ ఇలా చేయగలమా అనే బెంగ వెంటాడుతుంది. భయం పుట్టుకొస్తుంది. కానీ అభిమానులు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలుచుకొనే ప్రభుదేవా కు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. దీంటికి కారణం ఎవరు వంటి విషయాల్లోకి వెళ్తే, తన తండ్రి.. ప్రముఖ డాన్స్ మాస్టర్ సుందరం దగ్గర అసింస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా ఆ తరువాత డాన్స్ మాస్టర్ గా పలు చిత్రాలలో వినూత్నమైన డాన్స్ కంపోజ్ చేసి టాప్ కొరియొగ్రాఫర్ గా మారాడు. తరువాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమికుడు సినీమాతో హీరో అవతారం ఎత్తాడు. ఆ సినిమాలో ప్రభు చేసిన డాన్స్ అప్పటి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చింది. ఆతర్వాత డైరెక్టర్ అయ్యాడు. హిట్లు కొట్టాడు. అయినా డాన్స్ వదల్లేదు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.

నిజానికి వంట్లో ఎముకలకి బదులు స్ప్రింగ్ లు వున్నాయా అని అనుమానం కలిగేలా డాన్స్ చేసే ప్రభుదేవాకి ఇప్పుడు ఓ భయం పట్టుకొందట. అదేంటంటే తనకు డాన్స్ అంటే పిచ్చి . కానీ వయసు పెరిగేకొద్దీ ఇప్పటిలా డాన్స్ చేయలేనేమో అనే భయం అతన్ని వెంటాడుతోంది. ఇప్పటికే 44 సంవత్సరాలకు చేరిన ఈ స్టార్ డాన్సర్ కి సడన్ గా ఇలాంటి భయం ఎందుకు వచ్చినట్టు? ఇది కూడా వయస్సు ప్రభావమేనని, అలా అనిపించడం సహజమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చిన కబాలి డైరెక్టర్

ఇవి కూడా చదవండి:హాట్ ఫోటోషూట్ తో మతి పోగొట్టిన రెజీనా!

English summary

Indian Michael Jackson Prabhudeva was known for his stylish way of dancing and acting, he was also proved himself as a director and he directed some films also. According to a recent news that Prabhudeva was getting fear about his age.