రవితేజతో కంచె హీరోయిన్‌ రొమాన్స్‌!!

Pragya Jaiswal is pairing with Raviteja

04:16 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Pragya Jaiswal is pairing with Raviteja

'మిర్చిలాంటి కుర్రాడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ 'ప్రగ్యాజైస్వాల్‌'. ఈ చిత్రం సరిగా ఆడకపోవడంతో ప్రగ్యాకి సరిగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత క్రిష్‌ దర్శకత్వం వహించిన 'కంచె' చిత్రంలో హారోయిన్‌గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. 'కంచె' సూపర్‌హిట్‌ అవ్వడానికి ప్రగ్యా అందం, అభినయం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీనితో ప్రగ్యా స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని అనుకున్నారంతా, అయితే ప్రగ్యా స్టార్‌ హీరోయిన్‌ అయ్యిందో లేదో తెలీదు కానీ స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసింది, ఆ స్టార్‌ ఎవరో కాదు మాస్‌ మహారాజ్‌ రవితేజ.

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఎవడో ఒకడు' ఈ చిత్రానికి వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించగా దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారు, ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్‌ని ఒక హీరోయిన్‌గా ఎంచుకోగా మరో హీరోయిన్‌ని ప్రగ్యా జైస్వాల్‌ని ఎంచుకున్నారు. ఇందులో రవితేజ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం కూడా హిట్‌ అయితే ప్రగ్యా స్టార్‌ అయినట్టే.

English summary

Pragya Jaiswal is pairing with Raviteja in Yevado Okadu movie. Which is directing by Venu Sriram and Producing by Dil Raju.