సాయి ధరమ్ ని పెళ్లి చేసుకుంటున్న 'కంచె' హీరోయిన్!

Pragya Jaiswal marriage with Sai Dharam Teja

04:26 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Pragya Jaiswal marriage with Sai Dharam Teja

'మిర్చి లాంటి కుర్రాడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో ప్రగ్యా జైస్వాల్ అంటేనే ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే క్రిష్ తెరకెక్కించిన 'కంచె' చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా ఆ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు, ప్రగ్యా ఇందులో ఎంతో అందంగా ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశాలు. పాత హీరోయిన్లను చూసి చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ప్రగ్యా అందాలు కొత్త ఊరటను కలిగించాయి. ఈ చిత్రం తరువాత ప్రగ్యాకి వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టిన ప్రగ్యా అప్పుడే పెళ్లి చేసుకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా? అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది.

అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. సందీప్ కిషన్-రెజీనా జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'నక్షత్రం'. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో సాయి ధరమ్ తేజ్ ని కృష్ణ వంశీ తీసుకున్నాడు. 20 నిమిషాలు పాటు వుండే ఈ క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు. అలాగే మరో యంగ్ హీరో తనీష్ ఓ నెగటివ్ రోల్ చేయనున్నాడు. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ కూడా నక్షత్రంలో ఓ పోలీస్ క్యారెక్టర్ చేస్తుందట. అంతేకాదు ఈ మూవీలో ప్రగ్యాతో ఫైట్స్ కూడా కృష్ణ వంశీ చేయించబోతున్నాడట. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ప్రగ్యా జైస్వాల్ ని పెళ్లి కూడా చేసుకుంటాడట. ఈ విధంగా వీరిద్దరికీ కృష్ణవంశీ పెళ్లి ఫిక్స్ చేశాడన్న మాట!

English summary

Pragya Jaiswal marriage with Sai Dharam Teja