రానా మూవీలో నటించనన్న ప్రకాష్‌రాజ్‌!

Prakash Raj rejected to act in Rana movie

12:04 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Prakash Raj rejected to act in Rana movie

'బాహుబలి' చిత్రంలో ప్రభాస్‌కి ప్రతినాయకుడిగా నటించి ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నటుడు రానా దగ్గుబాటి. ఈ చిత్రంలో రానా నటనకు గానూ ఇటీవలే ఒక అవార్డు కూడా గెలుచుకున్నాడు, త్వరలోనే బాహుబలి-2 చిత్రం షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు. అయితే బాహుబలి-2 షూటింగ్‌ పూర్తయ్యాక రానా మరో యుద్ధ నేపధ్యమున్న 'ఘాజీ' అనే చిత్రంలో నటించబోతున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇండియా - పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో విశాఖ సముద్ర తీరంలో మునిగిపోయిన సబ్‌మరైన్ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో రానాతో పాటు మరో కీలకపాత్రకు ప్రకాష్‌రాజ్‌ని కూడా ఎంపిక చేశారు. అయితే ప్రకాష్‌రాజ్‌ ఈ చిత్రంలో నటించలేనని చెప్పాడు. దీనికి కారణం లేేకపోలేదు, ప్రకాష్‌రాజ్‌ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మన ఊరి రామాయణం' చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలన్న ఉధ్ధేశంతోనే ప్రకాష్‌రాజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ పాత్రకు వేరే నటుడ్ని ఎంపిక చేసే పనిలో పడింది 'ఘాజీ' టీమ్‌.

English summary

Prakash Raj rejected to act in Rana movie. The Ghazi Submarine movie directing by Sankalp Reddy.