సీఎమ్ కేసీఆర్‌కు సూసైడ్ లేఖ రాసి మరీ...

Prameela wrote suicide letter to CM KCR

03:36 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Prameela wrote suicide letter to CM KCR

కాలం మారింది .. మనుషులు మారారు... వింత పోకడలు తలెత్తుతున్నాయి. పాలకులకు తమ సమస్యలు విన్నవిస్తూ, వాటిని పరిష్కరించాలని అర్జీ పెట్టుకోవడం చూసాం.. కానీ ఓ సీఎమ్ కి స్యూసైడ్ లెటర్ రాయడం గురించి విన్నారా? మరి అది ఇదే. ఓ విద్యార్థిని బతుకు పరీక్షలో ఓడిపోయింది. కన్నతండ్రి లేకపోయినా తన సొంత కష్టంతో చదివించిన తల్లి కోసం తాను కష్టపడి చదివింది. డిగ్రీలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంది. ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష అయిన టెట్ గెలవలేక జీవితంతో రాజీపడలేక బలవన్మరణానికి యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

తాను చనిపోయినా టెట్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎలా ఆటంకంగా మారుతుందో ముఖ్యమంత్రికి వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన లక్ష్మయ్య, యాదమ్మల ఏకైక కుమార్తె ప్రమీల(25). లక్ష్మయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో యాదమ్మ ఇంట్లోనే మిషన్ కుడుతూ ప్రమీలకు కష్టపడి చదువు చెప్పించింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూస్తున్న ప్రమీల ఆమెకు తోడుగా నిలవాలనుకుంది. అందుకు కష్టపడి చదివింది. ఇంటర్‌లో బైపీసీ చేసిన తర్వాత డిగ్రీ, ఎంఎస్సీ కూడా పూర్తి చేసింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రమీల బీఈడీ కూడా పూర్తి చేసింది. టీచర్ ఉద్యోగం కోసం ప్రమీల టెట్‌కు ప్రిపేర్ అవుతోంది. టెట్‌లో అన్ని సబ్జెక్టుల వారికి కామన్ సిలబస్‌గా మ్యాథ్స్ కూడా చేర్చడంతో పదోతరగతి వరకే మ్యాథ్స్ చదివిన ప్రమీల ఆ సబ్జెక్టులో పట్టు లేకపోవడంతో చదువును భారంగా భావించింది. ముఖ్యమంత్రికి టెట్ విధానం పై బయో సైన్స్ విద్యార్ధులకు కష్టతరమవుతున్న తీరును సూసైడ్‌ నోట్‌లో రాసింది. గత శుక్రవారం ఇంట్లో ఉన్న ప్రమీల సూపర్ వాస్మాల్ 33 కేశ్‌కాలా తాగి ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన తల్లి యాదమ్మ, ఇరుగుపొరుగు వాళ్లు ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీల సోమవారం మృతి చెందింది. ఇక ఆమె రాసిన లేఖ ఇదిగో ఇలా వుంది. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి నమష్కరించి రాయునది ఏమనగా!

ఆర్యా!

నేను కె. ప్రమీల డాటర్ ఆఫ్ లక్ష్మయ్య. నాలాంటి ఎంతో మంది విద్యార్థుల మనస్సులో ఉన్న ఈ మాటని నేను మీకు చెప్పాలనుకుంటున్నా.. నేను ప్రస్తుతం ఎంఎస్సీ చేస్తున్నా. బీఈడీ కూడా అయిపోయి టెట్ కోసం చదువుతున్నా. నాది బీఈడీలో బయో సైన్స్ సబ్జెక్ట్. మాకు టెట్‌లో 30 మార్కులు మ్యాథ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం. మాకు టెన్త్ వరకే మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఎక్కడా మ్యాథ్స్ లేదు. టెట్‌లో మ్యాథ్స్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాథ్స్ ఉండటం వల్ల బయో సైన్స్ విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మ్యాథ్స్ తీసివేయాలని కోరుకుంటున్నాం.

నాకు ఉపయోగపడకపోయినా నా తోటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మ్యాథ్స్‌కు బదులు టెట్‌లో మెంటల్ ఎబిలిటి పెట్టమని కోరుతున్నా. ఇదే నా చివరి కోరికగా భావించి దీన్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నా.

ఇట్లు
తమ తెలంగాణ బిడ్డ
ప్రమీల.

English summary

Prameela wrote suicide letter to CM KCR. In Nalgonda a student wrote a suicide letter to CM KCR for not getting her a government job.