సాగర తీరాన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష

Pranab Mukherjee At International Fleet Review

11:29 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Pranab Mukherjee At International Fleet Review

విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరై నౌకాదళాల గౌరవందనం స్వీకరించారు. అనంతరం నౌకాదళ సమీక్షను ప్రారంభించారు. ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ , రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నౌకాదళ ప్రధాన అధికారులు ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో విశాఖ నగరానికి అభిముఖంగా సాగర జలాల్లోకి చేరుకున్నారు. సుమిత్ర యుద్ధనౌకను మరో ఐదు నౌకలు అనుసరించాయి. ఈసందర్భంగా ఆరు వరుసల్లో నిలిపి ఉంచిన 70 యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. నౌకాదళ సమీక్ష సమీక్షలో మొత్తం 90 యుద్ధ నౌకలు పాల్గొనున్నాయి. నౌకా దళ సమీక్షను వీక్షేందుకు వేలాదిగా సందర్శకులు తరలిరావడంతో విశాఖ సాగరతీరం జన సంద్రంగా మారింది. విశాఖ తూర్పు తీరంలో నౌకాదళ సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి కావడం తో వీక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక 7వ తేదీ ఆదివారం జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి వీలుగా విశాఖ నగరం , పరిసర ప్రాంతాల్లోని సినిమా హాల్లల్లో వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary

Indian Navy's International Fleet review was started grandly in Vishakapatnam.In the first day International warships exhibition was conducted and this was attracted by many people in Vizag.This main event to be conducted from 7th February in Vishakapatnam. Yesterday Indian President Pranab Mukherjee attend as cheif guest to this event.