ప్రణీత కు పెద్ద ప్రమాదం తప్పింది

Pranitha Subhash Met Road Accident

10:17 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Pranitha Subhash Met  Road Accident

ఖమ్మంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించి హైదరాబాద్‌కు కారులో వస్తున్న సినీనటి ప్రణీత ఆదివారం రోడ్డుప్రమాదానికి గురయింది.  నల్గొండ జిల్లా మోతె వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది . ఈ ప్రమాదంలో ప్రణీత, ఆమె తల్లి, మరో ముగ్గురు గాయపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న ప్రణీత స్వల్ప గాయాలతో బయట పడింది.  ఆ సమయంలో ఆమె సీటు బెల్టు ధరించడంతో పెనుప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తుండగా సీటు బెల్టు ధరించడం ఎంత అవసరమో సినీనటి ప్రణీతకు జరిగిన ప్రమాదం తేల్చిచెప్పింది. కాగా ప్రమాదం నేపధ్యంలో ఆసుపత్రికి తరలించడంతో  ఆమె ట్వీట్ చేస్తూ, స్వల్ప గాయాలేనని పేర్కొంది. 

1/5 Pages

English summary

Heroine Pranitha Subash Met a Road Accident in Nalgonda District in Telangana State.Pranitha Was attended to a Shopping mall opening cermony in Khamam and while he she was returning to Hyderabad her car met an accident.They were injured and taken to hospital for Treatment.