చంద్రులిద్దరూ వియ్యంకులవుతారా

Pratyusha Love With Maddileti Reddy in Andhra Pradesh

10:20 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Pratyusha Love With Maddileti Reddy in Andhra Pradesh

ఒక్కోసారి పరిణామాలు ఎటు నుంచి ఎటుకైనా దారితీయ వచ్చు. బద్ధ శతృవులు బంధువులుగా మారావచ్చు. బంధువులు శతృవులు గా మారిపోవచ్చు . ఇదే తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల సిఎమ్ లు ఇప్పుడు బియ్యం అందుకోబోతున్నారా? వివరాల్లోకి వెళ్తే , హైదరాబాద్ లో సవతి తల్లి పెట్టిన చిత్రహింసలకు తల్లడిల్లి చావుబతుకుల మధ్య ఉన్న 'ప్రత్యూష'ను తెలంగాణ సిఎం కెసిఆర్ చేరదీసి అక్కున చేర్చుకున్న విషయం గుర్తుంది కదా..అయితే, ఇప్పుడు సదరు ప్రత్యూష-కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాల మద్దులేటి రెడ్డి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తి ఒక్క రూపాయి కూడా తనకొద్దని, ఆమెపై జాలితోనే తనకు ప్రేమ పుట్టిందని ప్రియుడు మద్దులేటి రెడ్డి అంటున్నాడు. ప్రత్యూషకున్న రెండు కోట్ల విలువైన ఆస్తి అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటానంటున్నాడు.

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును కలిసి తమ ప్రేమ వివాహానికి సహకరించాలని మద్దులేటి రెడ్డి కోరాడు. అనంతరం వీరిరువురూ నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లినప్పుడే ప్రత్యూషతో పరిచయం ఏర్పడింది' అని మద్దులేటి రెడ్డి అంటున్నాడు. తాను రిజిష్టర్‌ బుక్‌లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష తనకు ఫోన్‌ చేసిందన్నాడు. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగిందని చెప్పాడు. ఇలా తమ ప్రేమ చిగురించి వివాహం వరకూ వచ్చిందన్నాడు. కాగా, ఈ సందర్భంగా అచ్చుతరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్‌ అందరి హృదయాలను గెలుచుకున్నారని, ఇప్పుడు ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మనవతా దృక్పథాన్ని చాటుకోవాలని కోరారు. అంతేకాదు, తెలంగాణ సిఎం కేసీఆర్‌ మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించి మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరఫున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారని కూడా ఆయన అంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:స్నేక్‌గ్యాంగ్‌కు జీవిత ఖైదు

ఇవి కూడా చదవండి:బతికుండగానే సమాధి చేసేసారట

English summary

A Girl Named Pratyusha was severely tortured by her step mother and later she was adopted by Telangana Chief Minister KCR and now she was in love with Maddileti reddy who belongs to Kurnool. Now all were eagerly waiting to KCR response on this issue.