ప్రత్యూష కు  అబార్షన్ అయిందా ..?

Pratyusha was pregnant and Made Abortion Before Death

03:21 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Pratyusha was pregnant and Made Abortion Before Death

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ గర్భవతి అని, తన మృతికి కొన్ని రోజులముందు ఆమె అబార్షన్ చేయించుకుని ఉండవచ్చునని ముంబైలోని జేజే ఆసుపత్రి డాక్టర్లు అంటున్నారు. ఆమె గర్భాశయ కణజాలం నుంచి కొన్ని శాంపిల్స్‌ను పరీక్షించాక ఈ విషయాన్ని నిర్దారించారట. బహుశా ప్రత్యూష ఆత్మహత్యకు నెల లేదా అంతకుముందే ఆమె గర్భస్థ ప్లాసెంటా దీన్ని నిరూపిస్తోందని డాక్టర్లు అంటున్నారు. తన గర్భస్రావానికి ఆమె యత్నించినట్టు ఈ పరీక్షలు రుజువు చేసినట్టు పేర్కొన్నారు. అయితే ప్రత్యూష ప్రెగ్నెన్సీకి కారణమెవరో తెలుసుకోవడం కష్టమేనట. సంబంధిత టిష్యూ లేకపోవడం వల్ల గానీ, అబార్షన్ జరగడం వల్ల గానీ డీఎన్ఏ పరీక్షలు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ పనికి కత్రినా 6 కోట్లు తీసుకుందట

ఇదిలా ఉండగా.. ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తలిదండ్రులు తమ కొడుక్కి ఏదైనా హాని జరిగితే అందుకు ప్రత్యూష పేరెంట్స్ బాధ్యులవుతారని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాయడం విశేషం. ఇటీవల రాహుల్ తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వాష్‌రూమ్ తలుపులు వేసుకుని చాలాసేపు బయటకు రాలేదు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడని వార్తలు వచ్చాయి. చివరకు డాక్టర్లు, అతని తలిదండ్రులు బుజ్జగించడంతో రాహుల్ వాష్‌రూమ్ తలుపులు తీసుకుని బయటకు వచ్చాడని కూడా అంటున్నారు. మొత్తానికి చిలవలు పలవలుగా ఎన్నో విషయాలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఇవి లేకుండా మన డైరెక్టర్లు సినిమా తీయలేరు

బాహుబలి మర్డర్ మిస్టరీ విలువ 150 కోట్లు

English summary

Balika vadhu Fame Pratyusha Benarjee was pregnant and she did abortion before few days ago of death . This was came out in DNA test and her boy friends parents have wrote letter to Maharashtra Chief Minister by Saying that if he does suicide then pratyusha parents will be the reason for that.