మొక్కలకు నీళ్లు పోసి విమర్శల పాలైంది

Pravina thakur Mayor waters plants despite heavy rains

10:38 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Pravina thakur Mayor waters plants despite heavy rains

ఇదేమిటి అనుకుంటున్నారా మరి అక్కడే ఉంది చిక్కు .. వివరాల్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది. ముంబైలోని వాసాయ్ -విరార్ ప్రాంతానికి మేయర్ . ప్రవీణా ఠాకూర్ ఇటీవల ముంబైలో చేపట్టిన గ్రీన్ డ్రైవ్ కు ఎనలేని ప్రశంసలు, కీర్తి వచ్చేసాయి. ఆ ఉత్సాహంతోనే మొక్కల పెంపకం కూడా చేపట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు. అనుచరగణంతో తరలి వెళ్లి మొక్కలకు నీళ్లు పోశారు.అయితే అది కాస్తా , విమర్శల పాలైంది. ఆమెను నలుగురిలో నవ్వుల పాలు చేసింది.

మొక్కలకు నీళ్లు పోస్తే, ఇలా అవ్వడమేమిటని అనుకుంటున్నారా అవును ఆమె ముందూ, వెనుకా ఆలోచించకుండా పబ్లిసిటీ కోసం చేసిన పని కామెడీగా తయారై, నెటిజన్లు విమర్శలతో కుమ్మేస్తున్నారు. సరిగ్గా ఆమె మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయానికి జోరుగా వాన కూడా కురుస్తోంది. అయినా ఆమె వెనక్కి తగ్గకుండా గొడుగు వేసుకుని మరీ మొక్కలకు నీరు పోశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఆమెను విమర్శలకు గురిచేస్తోంది ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె మీద వందల సంఖ్యలో సెటైర్లు పడిపోతున్నాయి. అయినా మన నేతల తీరు మారేనా?

ఇది కూడా చూడండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

English summary

Mayor Pravina thakur waters plants despite heavy rains and people can’t stop laughing.